హైదరాబాద్: తెలుగును నేర్చుకుని రాయడం, చదవడమేకాకుండా తెలుగు వ్యాకరణం, పద్యాలు అలవోకగా చదివేస్తున్న యుఎస్ కు చెందిన బ్రీ అనే విదేశీయురాలిని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ బుధవారం రవింద్రభారతీలో అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
మన తెలుగు భాషను నేర్చుకోవడానికి ఎంతోమంది విదేశీయులు తహతహలాడుతున్నారన్న దానికి యుఎస్ కు చెందిన బ్రీ అనే అమ్మాయి నిదర్శనమన్నారు. ఒక విదేశీయురాలు తెలుగు భాష మీద ఇష్టంతో సొంతంగా తెలుగు రాయడం, చదవడం నేర్చుకోవడం గొప్ప విషయమన్నారు. తెలుగులో రాయడం, చదవడమే కాకుండా తెలుగు వ్యాకరణం, పద్యాలు అలవోకగా చదివేస్తున్నదని తెలిపారు. నేటి యువత బ్రీ ని ఆదర్శంగా తీసుకొని తెలుగు భాష ఉన్నతికి కృషి చేయాలని కోరారు.
అలాగే బ్రీ బుధవారం సాహిత్య అకాడమి కార్యాలయానికి వచ్చి తెలుగు పద్యాన్ని మంచి ఉచ్చారణతో చదివి వినిపించింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Jun,2022 08:51PM