హైదరాబాద్ : తెలంగాణలో గురువారం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ (పాలీసెట్-2022) పరీక్ష జరుగనుంది. రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 11.00 గంటల నుండి మ. 1.30 వరకు పరీక్ష జరుగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 1,13,974 మంది అభ్యర్థులు 365 పరీక్ష కేంద్రాలలో పరీక్షకు హాజరవుతున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఒక గంట ముందుగానే అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఒక్క నిమిషం ఆలసమైనా లోపలకు అనుమతించారు. విద్యార్థులు కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి రావాలని అధికారులు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Jun,2022 09:07PM