ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో రాష్ర్టంలో పలు మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు నగరాల పేర్లు, ఒక ఎయిర్ పోర్టు పేరును ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర రాజధాని ముంబై పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ పాండే గురువారం పదవీ విరమణ చేయనున్నారు. దాంతో ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వివేక్ ఫణ్‌షాల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం వివేక్ ఫణ్‌షాల్కర్ ముంబై పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని థానే నగర పోలీస్ కమిషనర్‌గా వివేక్ ఫణ్‌షాల్కర్ పనిచేస్తున్నారు అంతకుముందు ముంబై అవినీతి నిరోధక శాఖ చీఫ్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm