ముంబై : మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేశారు. బుధవారం రాత్రి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
అంతకుమందు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న మహారాష్ట్ర గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య సమస్యలకు సభలో బలనిరూపణ ఏకైక మార్గమని కోర్టు అభిప్రాయపడింది. గవర్నర్ ఆదేశాల ప్రకారం గురువారం బలపరీక్ష నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో అసెంబ్లీలో జరగాల్సిన బల పరీక్షకు ముందే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Jun,2022 09:51PM