హైదరాబాద్: ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు, నాచారం పోలీసులు గురువారం సంయక్తంగా దాడులు నిర్వహించి గంజాయి గుట్టును రట్టు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వివరాలు వెల్లడించారు. కొండాపూర్‌లో నివసిస్తున్న కె.సుబుది జాన్సన్, బోరబండకు చెందిన మహ్మద్ షోయబ్ వైజాగ్ ఏజెన్సీలో తక్కు ధరకు కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నారు. దీనిపై నిఘా వేసిన పోలీసులు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి ద్విచక్ర వాహనం, 25 కేజీలో గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. సుధీర్ సాహూ పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న జియాగూడకు చెందిన బి.జైకిసాన్, న్యూ బోయిన్‌పల్లికి చెందిన విద్యాసాగర్‌ను రాచకొండ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకోవడమే కాకుండా 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.12 లక్షలని డీసీపీ వెల్లడించారు. ఏసీపీ లక్ష్మి, శివకుమార్, బాను చౌహాన్, వెంకన్న, మన్మోహన్, గురువారెడ్డి, నాచారం సీఐ కిరణ్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm