న్యూఢిల్లీ: గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల సిలిండర్ ధరలు పెంచుతూ వస్తున్నది. దీంతో ఒకటో తారీఖు వచ్చిందంటే వేటి ధరలు పెరుగుతాయేమోనని సామాన్యులు భయపడుతున్నారు. అయితే ఈసారి కేంద్రంలోని బీజేపీ సర్కారు కాస్త కరుణించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.198 తగ్గించింది. దీంతో ఢిల్లీలో రూ.2219 నుంచి రూ.2021కి పడిపోయింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో రూ.2426గా ఉన్న సిలిండర్ ధర రూ.2243కు చేరింది. అంటే రూ.183.50 తగ్గింది. ఇక కోల్‌కతాలో రూ.182, ముంబైలో 190.5, ముంబైలో రూ.187 మేర తగ్గాయి. కాగా, గత నెల 1న కమర్షియల్ సిలిండర్‌పై రూ.135 తగ్గిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm