అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. సినిమా టికెట్ల మొత్తాన్ని ఆన్‌లైన్‌లో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69 పై హైకోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 69 పై తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 69 ని సవాల్ చేస్తూ బుక్ మై షో, మల్టీప్లెక్స్ లు విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ హైకోర్టులోపిటిషన్లు దాఖలు చేసింది. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm