తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురంలోని గురువారం రాత్రి సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఎకె గోపాలన్ సెంటర్‌లో ఉన్న కార్యాలయంపై రాత్రి 11.30 గంటలకు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు పికె శ్రీమతి కార్యాలయంలోనే ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.
పార్టీ కార్యాలయం గేటు వద్ద బాంబు పడటంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సిసిటివి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి పేలుడు పదార్థాలను విసిరి పరారయ్యాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పార్టీ నేత రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ దాడి ఘటనను సీపీఐ(ఎం) నేతలు ఖండించి నిరసనలు చేపట్టారు. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ పనేనని నేతలు ఆరోపించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎల్‌డిఎఫ్ కన్వీనర్, సీపీఐ(ఎం) నేత ఇపి జయరాజన్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఎకె గోపాలన్ సెంటర్ కార్యాలయంపై దాడి జరగడం ఇది మూడోసారి.
ఇటీవల వయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాయలంపై దాడి జరగ్గా... ఇది అధికార పార్టీ కార్యకర్తల పనే అని సదరు పార్టీ ఆరోపించింది. కాగా, రాహుల్ గాంధీ నేడు కేరళను సందర్శిస్తున్న సమయంలో ఈ బాంబు దాడి చోటుచేసుకోవడం చర్చనియాంశమైంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Jul,2022 12:10PM