న్యూఢిల్లీ : రాజస్తాన్‌లోని ఉదయ్ పూర్‌లో దర్జీ కన్హయ్య లాల్ హత్య తర్వాత రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ జాబితాలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి), ఉదపూర్ ఎస్పీ తో సహా అనేక మంది సీనియర్ అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు సోషల్ మీడియా వేదికగా కన్హయ్య మద్దతు తెలపడంతో ఇద్దరు వ్యక్తులు రియాజ్ అక్తారీ, గౌస్ మహ్మద్ లు అత్యంత కిరాతకంగా అతన్ని చంపేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు పాకిస్తాన్‌కు చెందిన దావత్ ఏ ఇస్లామీ సంస్థతో సంబంధాలున్నాయని రాజస్తాన్ పోలీసులు గుర్తించారు. వీరిని గురువారం కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.
Mon Jan 19, 2015 06:51 pm