అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం ఉదయం 145వ శ్రీ జగన్నాథుని రథయాత్రను ప్రారంభించారు. అహ్మదాబాద్ నగరం పాత బస్తీలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల ఆశీర్వాదాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. జగన్నాథ దేవాలయం ట్రస్టీ మహేంద్ర ఝా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు బుధవారం కోవిడ్-19 లక్షణాలు స్వల్పంగా కనిపించాయని చెప్పారు. వైద్యుల సలహాలను పాటిస్తూ ఆయన శ్రీ జగన్నాథ రథయాత్రను ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పటేల్ హాజరవడంపై అనుమానాలు వ్యక్తమవడంతో తాము గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కూడా ఆహ్వానించామని చెప్పారు. అయితే పటేల్ హాజరవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm