హైదరాబాద్ : దేశంలో బంగారం ధరలు పెరగనున్నాయి. బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వల్ల దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిని జూన్ 30వ తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. దీనికితోడు ఇప్పటికే బంగారంపై ఉన్న 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్, మూడు శాతం జీఎస్టీ కూడా వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు మూడు శాతం పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు అర శాతం తగ్గడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm