హైదరాబాద్ : హైదరాబాద్ లోని మత్స్యశాఖ కమిషనర్ కార్యలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చేపపిల్లల స్కీంలో కాంట్రాక్టర్ అక్రమాలను నిరసిస్తూ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు,ర కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm