హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. హెవీ వెయిట్ రిలయన్స్ తో పాలు పలు ఎనర్జీ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టపోయాయి. చమురు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను కేంద్రం విధించడంతో ఈ సంస్థలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు కోల్పోయి 52,907కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద స్థిరపడింది.
Mon Jan 19, 2015 06:51 pm