అమరావతి : ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంట్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. అల్లూరిని స్మరించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలో అల్లూరిని చేర్చించినందుకు తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm