హైదరాబాద్ : తెలంగాణలో మరో 1663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1663 ఖాళీల్లో ఇంజనీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు, నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ, 212 టెక్నికల్ పోస్టులకు అనుమతినిచ్చింది. అలాగే నీటిపారుదలశాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి అనుమతినిచ్చింది. అంతేకాకుండా భూగర్భ జలశాఖలో 88, ఆర్‌అండ్‌బీలో 38 సివిల్ ఏఈ పోస్టులకు, 145 సివిల్ ఏఈఈ పోస్టులకు, 13 ఎలక్ట్రిక్ ఏఈఈ, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది.
Mon Jan 19, 2015 06:51 pm