న్యూఢిల్లీ : పాకిస్థాన్ కు చెందిన మూడేండ్ల బాలుడు అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. అయితే ఆ బాలుడిని భద్రతా బలగాలు పాక్ ఆర్మీకి అప్పగించాయి. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు శనివారం తెలిపాయి. బీఎస్ఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఓ మూడేండ్ల బాలుడు పాక్ నుంచి సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి రాగా ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన సైనికులు గుర్తించారు. బాలుడి వివరాలను తెలుసుకు నేందుకు ప్రయత్నించగా అతను ఏమీ చెప్పలేకపోయాడు. దాంతో బీఎస్‌ఎఫ్ పాక్ రేంజర్లను వారు సంప్రదిం చారు. అనంతరం రాత్రి 9.45 గంటల సమయంలో ఆ బాలుడిని మానవతా దృక్పథంతో అప్పగించినట్టు అధికారులు తెలిపారు. అనుకోకుండా సరిహద్దు దాటే వారితో బీఎస్‌ఎఫ్ ఎల్లప్పుడూ మానవీయణ కోణంలో వ్యవహరిస్తుందని వారు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm