హైదరాబాద్ : ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో ఫోటో పెట్టాడని కన్హయ్యలాల్ అనే టైలర్ ను రియాజ్ అట్టారీ, గౌస్ మహ్మద్ అనే నిందితులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితులతో బీజేపీతో సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకు సంబంధించి బీజేపీ నేతలతో నిందితులు కలిసి ఉన్న ఫొటోలను బయటపెట్టింది.
దీనిపై బీజేపీ రాజస్థాన్ విభాగం స్పందించింది. ఆ నిందితులిద్దరితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రాజకీయ నేతలతో ఎవరైనా ఫొటోలు దిగొచ్చని.. అంతమాత్రాన వారు బీజేపీలో సభ్యులైపోతారా? అంటూ ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Jul,2022 05:18PM