హైదరాబాద్ : తమను కించపరిచేలా మంత్రి కేటీఆర్ మాట్లాడారంటూ విశ్వబ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనిపై తాజాగా కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మొన్న జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన సందర్భంగా.విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. ప్రతిపక్షాలే కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కులాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని తాను కాదన్నారు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించి అన్న మాట వల్ల ఎవరైనా బాధపడితే ఆ మాటని ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm