కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది.. గత నెల 12న జిల్లా కేంద్రమైన కొత్తగూడం ఎంజీ రోడ్డు ప్రాంతంలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లాలో నాలుగో విడత వ్యాప్తి ప్రారంభమైంది. అప్పటినుంచి జిల్లాలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా మూడు నుంచి ఎనిమిది కేసులు నమోదవుతుండడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గత ఆరు నెలల క్రితం కొవిడ్ ఉధృతి తగ్గిపోవడంతో జిల్లా ప్రజలు తమ రోజువారీ దినచర్యలో బీజీగా మారిపోయారు. ఈ నేపధ్యంలో మరోమారు ఈ మహమ్మారి జిల్లా ప్రజలను భయపెడుతోంది. ఈ నేపధ్యంలో ఇంతకుముందులానే కరోనా నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ ఇటీవల ప్రకటన జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm