హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. హైదరాబాద్‌లో తన నివాసం ముందు నిన్న గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, అందులో ఒకరిని పట్టుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని లేఖలో పేర్కొన్నారు. కేసుకు సంబంధించి వారి నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని, ఇది తనకు, తన కుటుంబ భద్రతకు సంబంధించిన విషయమని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రెక్కీని తేలికగా తీసుకున్నారని, ఏపీ పోలీసులకు ఆయన సహకరిస్తున్నారని లేఖలో ఆరోపించారు. గచ్చిబౌలి పోలీసులు తన వ్యక్తిగత భద్రత సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేయాలని చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm