చెన్నై : తమిళనాడులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 54 సంవత్సరాల మహిళ మేకప్ వేసుకుని 35 ఏండ్ల వ్యక్తిని మోసం చేసి పెండ్లాడింది. ఆమె మొత్తం ఇప్పటివరకు అలా ముగ్గురిని పెండ్లి చేసుకున్నట్టు తేలింది.
తిరువళ్లురు జిల్లా పుదుప్పేటలో ఇంద్రాణి అనే మహిళ కుమారుడి హరితో కలిసి నివాసం ఉంటుంది. అతడి వయసు 35 ఏండ్లు. ఓ ప్రయివేటు కంపెనీలో మానేజర్‌గా పని చేస్తున్నాడు. హరికి ఇదివరకే వివాహం అయ్యింది. కానీ భార్యతో విబేధాల కారణంగా కొన్నేండ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అయితే ఇంద్రాణి గత ఆరేండ్లుగా కుమారుడికి వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో 2021లో బ్రోకర్ ద్వారా తిరుపతి, పుత్తూరుకు చెందిన శరణ్య అనే 54 ఏండ్ల మహిళ పరిచయం అయ్యింది. పెండ్లి చూపులకు శరణ్య 34 ఏండ్ల యువతిగా తయారైంది. ఆమె వివరాలు నచ్చడంతో హరి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ఎదురు కట్నంగా 25 సవర్ల బంగారం పెట్టాడు.
ఆ తర్వాత శరణ్య వాళ్లకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. భర్త సంపాదనంతా తనకే ఇవ్వాలని.. ఆస్తులన్ని తన పేరు మీద రాయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆధార్ కార్డు బయటికి తీయగా ఆమె అసలు వయసు బయటపడింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. పుత్తూరుకు చెందిన శరణ్య ఇప్పటికే ముగ్గురిని మోసం చేసినట్టు తేలింది. శరణ్య అలియాస్ సుకన్యకి పుత్తూరుకి చెందిన రవితో వివాహం కావడమే కాక ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే కొద్ది కాలం క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది. అనంతరం పెండ్లీల బ్రోకర్లను కలిసి విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసేది. రెండో వివాహం చేసుకుని 11 సంవత్సరాలు కాపురం చేసింది. కరోనా కాలంలో తల్లిని చూసి వస్తానని వచ్చింది శరణ్య. తర్వాత హరి సంబంధం గురించి తెలిసి రెండో భర్తను వలేసింది. అంతేకాక మొదటి భర్త రవిపై కేసు పెట్టి 10 లక్షలు వసూలు చేసింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Jul,2022 05:53PM