న్యూఢిల్లీ : రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. మంగళవారం దేశ చరిత్రలోనే అతి తక్కువగా డాలర్ కు రూ.79.36 పైసలుకు రూపాయి విలువ పతనమైంది. సోమవారం నాటి ముగింపుతో పోల్చితే 41పైసలు తగ్గిపోవడం గమనార్హం. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో డాలర్లకు డిమాండ్ బాగా పెరిగిందని.. ఇది రూపాయి బలహీనం కావడానికి కారణమైందని ఆర్థిక వేత్త అనుజ్ చౌదరి తెలిపారు. మన దేశ పారిశ్రామిక, ఇతర అభివృద్ధి గణాంకాలు కూడా బలహీనంగా ఉండటంతో పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్టు అంచనా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm