యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై ఆగివున్న డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Mon Jan 19, 2015 06:51 pm