Jubilant to welcome @SAFRAN group’s decision to select Hyderabad for its Mega Aero Engine MRO in India
— KTR (@KTRTRS) July 6, 2022
This will be SAFRAN’s largest MRO globally and will be the first Engine MRO established by a global OEM in India pic.twitter.com/gzYdfe4SB3
హైదరాబాద్ : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ర్టంలో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు సాఫ్రాన్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దది అన్నారు. ప్రపంచ స్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు. ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు రూ. 1,200 కోట్లు అని తెలిపారు. 800 నుంచి 1000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇది భారతీయ, విదేశీ వాణిజ్య విమానయాన సంస్థలు ఉపయోగించే వారి మార్కెట్ లీడింగ్ లీప్ 1A మరియు లీప్ 1B ఏరో ఇంజిన్‌లకు సేవలు అందిస్తుందన్నారు. ఈ ఇంజిన్ ఎంఆర్ఓ ప్రాజెక్ట్ తెలంగాణలోని స్థానిక ఏరోస్పేస్ తయారీ, ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థపై భారీ గుణకార ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారన్నారు. ఈ పెట్టుబడితో ఏరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారబోతుందని మంత్రి చెప్పారు.