హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, పంజాబ్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో వివాహం చేసుకోనున్నారు. ఆయన ఆరు సంవత్సరాల క్రితం మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు.
ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తల్లి హర్పాల్ కౌర్ కు అతను మళ్లీ స్థిరపడాలని కోరిక. దాంతో ముఖ్యమంత్రి తల్లి, సోదరి ఎంపిక చేసిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను సీఎం భగవంత్ మాన్ మాన్ వివాహం చేసుకోనున్నారు. ఈ పెండ్లి గురువారం చంఢీగఢ్‌లో జరగనుంది. చంఢీగఢ్ సెక్టార్‌లోని ఓ గురుద్వారా అత్యంత నిరాడంబరంగా, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఈ వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు.
ప్రస్తుతం భగవంత్ మాన్ మొదటి భార్య, పిల్లలు అమెరికాలో నివసిస్తున్నారు. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన పిల్లలిద్దరూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 02:48PM