హైదరాబాద్ : మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో చైనాకు చెందిన హి బింగ్ జియావొపై సింధు 21-13,17-21,21-15 తేడాతో విజయం సాధించింది.
అలాగే భారతీయ ఆటగాడు బీ సాయి ప్రణీత్ కూడా తొలి రౌండ్ గెలిచాడు. కెవిన్ కార్డెన్తో జరిగిన మ్యాచ్ లో సాయి ప్రణీత్ 21-8, 21-9 తేడాతో గెలిచాడు. ఇక సమీర్ వర్మకు మాత్రం ఓటమి ఎదురైంది. తైవాన్కు చెందిన చో టైన్ చెన్తో సమీర్ 10-21,21-12,21-14 తేడాతో ఓడిపోయాడు.
Mon Jan 19, 2015 06:51 pm