ముంబై : తమిళనాడులో ప్రభుత్వం మార్పుపై ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తి తమిళనాడులోనూ పుట్టుకొస్తారని.. మహారాష్ట్ర తరహాలో అక్కడ కూడా అధికార మార్పిడి ఖాయమని అన్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ర్టలో బాల్ ఠాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ సినిమాల్లోకి వెళ్లారని.. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మొదటి కుమారుడు ముత్తు కూడా అంతేనన్నారు. ఇద్దరూ సినిమాలు చేయాలని అనుకున్నారు కానీ అవి సరిగా ఆడలేదని చెప్పారు. ఇక ఠాక్రే రెండో కుమారుడు కుటుంబానికి దూరంగా ఉన్నారని.. కరుణ రెండో కుమారుడు అళగిరి కూడా అంతేనన్నారు. అలాగే ఠాక్రే మూడో కుమారుడు ఉద్ధవ్కు మహారాష్ట్ర సీఎం అయ్యే అవకాశం వచ్చిందని... అదే తరహాలో స్టాలిన్ తమిళనాడు సీఎం అయ్యారని తెలిపారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నారని... స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా అలాగే భావిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో మహారాష్ట్ర తరహాలో త్వరలో తమిళనాడులోనూ అధికారం చేతులు మారుతుందని అన్నారు. రాష్ట్రంలోనూ ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తి పుట్టుకొస్తారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 05:34PM