లండన్ : బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో వరుసగా మంత్రులు రాజీనామా చేస్తున్నారు. మంగళవారం నుంచి మొదలైన రాజీనామాలు బుధవారం సాయంత్రానికి ఏకంగా 10కి చేరిపోయాయి. దాంతో జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పదా ? అని చర్చలు జరుగుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
2019లో లైంగిక దుష్ర్పవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్ పించర్‌ను జాన్సన్ తన క్యాబినెట్‌లో సీనియర్ సభ్యుడిగా నియమించాడు. దాంతో ఇది బ్రిటన్‌లో దుమారం రేపింది. అయితే పించర్‌పై లైంగిక ఆరోపణల విషయం జాన్సన్‌కు తెలియదని జులై 1న బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆరోపణల గురించి ప్రధానికి తెలుసని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. అనంతరం పించర్‌ను ప్రమోట్ చేసే విషయంలో పొరపాటు జరిగిందని బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ అంగీకరించారు. తన ప్రభుత్వంలోని సీనియర్ సభ్యుడి లైంగిక దుష్ర్పవర్తన విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయానన్నారు. ఈ పరిణామం అనంతరం ఇద్దరు మంత్రులు తప్పుకున్నారు. ఆ తర్వాత వరుసబెట్టి మంత్రులంతా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Jul,2022 07:13PM