న్యూఢిల్లీ: విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే ఓ విమానం ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం చోటుచేసుకుంది. విస్తారా విమానయాన సంస్థ బుధవారం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకెళ్తే.. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం యూకే-122 మంగళవారం సాయంత్రం బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. అయితే విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే రన్ వే నుంచి పార్కింగ్ బే వద్దకు తీసుకెళ్లేందుకు ఇంజిన్ 2ని పైలట్లు ఆపివేశారు. అనంతరం ఒక ఇంజిన్‌తో ఆ విమానం కొంత దూరం వెళ్లగా తర్వాత ఫెయిలైంది. దాంతో పైలట్లు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించారు. అనంతరం విమానం లాక్కెళ్లే వాహనం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లోని పార్కింగ్ బే వద్దకు ఆ విమానాన్ని చేర్చారు.
Mon Jan 19, 2015 06:51 pm