హైదరాబాద్ : ఒడిశాలో ఓ 58 ఏండ్ల తాజాగా పదో తరగతి బోర్డు పరీక్షలు రాసి పాసయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంగాడ కన్హార్ 1978లోనే తన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించారు. అయితే ఆయన పదో తరగతి పూర్తి చేయాలని ఆశ ఉండేది. ఈ క్రమంలో రాష్ట్ర ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ నిర్వహించిన పరీక్షలు తాజాగా రాశారు. అనంతరం విడుదల చేసిన ఫలితాల్లో 500 మార్కులకు గాను 364 మార్కులు తెచ్చుకున్నారు. బీ1 గ్రేడ్ సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm