న్యూఢిల్లీ : దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం సృష్టిస్తోంది. అసోంలో జపనీస్ ఎన్‌సెఫలిటిస్(బ్రెయిన్ ఫీవర్) వైరస్ వణికిస్తుండగా.. పశ్చిమబెంగాల్ లో బ్లాక్ ఫీవర్ కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో 16 కొత్త కేసులు నమోదు కాగా మోరిగావ్, నల్‌బరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అసోంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 23 మంది ఈ వైరస్ తో చనిపోయారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇక పశ్చిమబెంగాల్ లోని 11 జిల్లాలో మొత్తం 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు వెలుగు చూశాయి. ప్రధానంగా డార్జిలింగ్, మాల్డా, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, కలింపోంగ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి. ఎక్కువ రోజుల పాటు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఉండి వచ్చిన వారిలోనే జ్వరం బయటపడుతోందని ఓ అధికారి తెలిపారు. అలాగే బంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ్యక్తుల్లోనూ ఈ లక్షణాలు ఉన్నాయన్నారు. అయితే తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలా అజార్ తో ఎవరు ప్రయివేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినా తాము పూర్తిగా భరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jul,2022 01:22PM