అమరావతి: ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి చామకురి శ్రీధర్ సీసిఎల్ఏలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా, ఎన్.తేజ్ భరత్‌ను తూర్పు గోదావరి జిల్లా జేసీగా బదిలీ చేసింది. అపరాజిత సింగ్‌ను కృష్ణా జిల్లా జేసీగా, టి. నిశాంతిని నంద్యాల జిల్లా జేసిగా నియమించింది. మహేష్‌కుమార్‌ను పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్‌గా, ఎన్. మౌర్యను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm