నవతెలంగాణ-మల్లాపూర్
ప్రమాదవశాత్తు గోదావరిలో కాలుజారి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మొగిలిపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం కోరుట్ల పట్టణానికి చెందిన సాంబారి శ్యాంసుందర్ 45 శనివారం సాయంత్రం మొగిలిపేట గోదావరికి నది స్నానానికి స్నేహితులతో కలిసి వచ్చారు. శ్యాంసుందర్ స్నేహితులు స్నానాలు ముగించుకొని నది ఒడ్డుకు చేరుకోగా శ్యాంసుందర్ ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో గోదావరిలో పడిపోయాడు స్నేహితులు చూస్తున్న గాని నీటిలో పూర్తిగా మునిగి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై నవీన్ కుమార్ గజ ఈతగాళ్లతో శ్యాంసుందర్ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై నవీన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Nov,2022 08:03PM