హైదరాబాద్: విశాఖలో నిన్న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం అనంతరం మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాలన త్వరలో విశాఖ నుంచి జరుగుతుందని తెలిపారు. మూడు రాజధానులకు అందరి మద్దతు ఉందన్న ఆయన గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే విశాఖపట్టణం నుంచి పరిపాలన సాగిస్తారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ త్వరలో చేపట్టనున్న పాదయాత్రపై రాష్ట్రంలో ఏ సమస్య ఉందని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm