హైదరాబాద్: నేడు ఇప్పటం బాధితులు ఒక్కొక్కరికీ జనసేన తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటం ప్రజలకు ఉన్న తెగింపు అమరావతి రైతలకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అండగా ఉన్న ఇప్పటం గ్రామస్థులకు తాను అండగా నిలుచుంటానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై పవన్ మండిపడ్డారు. వైసీపీ గడప కూల్చేదాకా విశ్రమించబోమని తేల్చిచెప్పారు. జనసేన పార్టీకి స్థలం ఇచ్చారని ఒకే ఒక కారణంతో ఇప్పటంలో ఇలాంటి పూజ చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కూల్చకుండా వదిలేసి కక్షపూరితంగా వ్యవహరించాలని మండిపడ్డారు. ఇప్పటం ప్రజలకు భయపడ వద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇప్పటం ప్రజల తెగింపు అమరావతి రైతులు కూడా చూపించి ఉంటే రాజధాని అక్కడి నుంచి కదిలేని కాదని స్పష్టం చేశారు. భయపడితే చంపేస్తారని, భయపడకుండా నిలబడాలని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm