హైదరాబాద్: నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు జెన్కో అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ కూడా వచ్చే అవకాశం ఉండడంతో.. ప్లాంటు ఆవరణలో రెండు హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. హెలీప్యాడ్ పనులను, ముఖ్యమంత్రి పరిశీలించనున్న ప్లాంటు పరిసరాలను మిర్యాలగూడ ఆర్డిఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావులు జెన్కో అధికారులతో కలిసి పరిశీలించారు. దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇది మొదటిది. ఒకే స్థలంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2022 07:41AM