హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న తరుణంలో ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. రాంగ్ రూట్ లో రావడం, ట్రిపుల్ రైడింగ్ తదితర కారణాలవల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చేసిన అధ్యయనంలో తేలింది. దీంతో, వీటిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700, ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 వరకు జరిమానా విధించనున్నారు. జీబ్రా లైన్ దాటిన వాహనానికి రూ. 100, ఫ్రీలెఫ్ట్ కు అడ్డంగా వాహనాన్ని నిలిపితే రూ. వెయ్యి ఫైన్ వేయనున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడరాదని, ప్రతి ఒక్కరూ రూల్స్ ని కచ్చితంగా పాటించాలన్నారు. దరి సహకారంతో హైదరాబాద్ ను ప్రమాద రహిత నగరంగా మార్చాలనేదే తమ లక్ష్యమని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2022 09:32AM