హైదరాబాద్: అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, నెల రోజుల్లో కొన్ని పనులు, మరో 6 నెలల్లో ఇంకొన్ని పనులు చేయాలన్న కాలపరిమితులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి వ్యవహారానికి సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జనవరి 31 లోపు తప్పనిసరిగా జవాబు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm