#WATCH | Chattarpur, Delhi: Woman climbs up the stage of Hindu Ekta Manch's program 'Beti Bachao Mahapanchayat' to express her issues; hits a man with her slippers when he tries to push her away from the mic pic.twitter.com/dGrB5IsRHT
— ANI (@ANI) November 29, 2022
న్యూఢిల్లీ: ఛత్తార్‌పూర్‌లో సోమవారం హిందూ ఏక్తా మంచ్ వాళ్లు బేటీ బచావో మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో కార్యక్రమంలో నేతలు ఒక్కొక్కరుగా ప్రసంగిస్తున్నారు. ఈ తరుణంలో తన సమస్య చెప్పుకుంటానంటూ ఓ మహిళ వేదికపైకి వచ్చింది. వచ్చీ రావడంతోనే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు మొదలుపెట్టడంతో పక్కనున్న ఓ నేత ఆమెను మైకు నుంచి దూరం నెట్టేసే ప్రయత్నం చేశాడు. దాంతో ఆగ్రహించిన మహిళ వెంటనే కాళ్ల చెప్పులు తీసి కొట్టడం మొదలుపెట్టింది. అందరూ ఆపుతున్నా ఆగకుండా రెండు చేతులతో రెండు చెప్పులు తీసుకుని కొట్టింది.