హైదరాబాద్ : తిరుమలలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర టీటీడీ విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను పొంది అధిక ధరకు విక్రయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బెంగళూరు, తమిళనాడు భక్తులను దళారులు మోసగించారు. పలువురు దళారులపై పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm