హైదరాబాద్ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసు దర్యాప్తునకు తాను సహకరిస్తానని, తనకు తానుగా ఏడుసార్లు స్టేట్‌మెంట్ రికార్డు కోసం కోర్టుకు హాజరవుతానని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సత్యేందర్ జైన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మే 30న అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ నెల 17న కోర్టు ఆ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ఇప్పుడు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులో జైన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Nov,2022 09:54PM