పెరంబూర్: రాష్ట్ర ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 9వ తేదీ విడుదల చేశారు. ఆ రోజు నుంచే తమిళనాడులో ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు, కొత్తగా చేర్పులు, చిరునామా మార్పు తదితరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. అందులో భాగంగా ఈ నెల 12,13,26,27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. దీనిసై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు మాట్లాడుతూ, నాలుగు రోజులు నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో 17,02,689 దరఖాస్తులు అందాయన్నారు. ప్రవాస తమిళులకు కూడా రాష్ట్ర ఓటరు జాబితాలో పేరు నమోదుచేసుకొనే అవకాశం కల్పించగా, 9 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm