హైదరాబాద్: కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల వాంతులు, పొత్తికడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు హనగల్ లోని పెద్దాస్పుత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతడి పొట్టలో పెద్ద సంఖ్యలో నాణాలు ఉన్నాయని తేల్చారు. కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చిందీ అసాధారణ సంఘటన. దీంతో ఆపరేషన్ చేసి, రెండు గంటల పాటు కష్టపడి నాణాలన్నీ బయటకు తీశారు. వాటిని లెక్కించగా మొత్తం 187 నాణాలు ఉన్నాయని తేలింది. పొరపాటున ఒక్క నాణెం కడుపులోకి వెళితేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది, అలాంటిది ఏకంగా 187 నాణాలు ఆ యువకుడి కడుపులోకి ఎలా వెళ్లాయని వైద్యులు ఆరా తీశారు. దీంతో సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తేలిందని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm