హైదరాబాద్: దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల 11వ వేజ్‌బోర్డు సమావేశం బుధవారం కోల్‌కత్తాలో జరగనుంది. 7వసారి జరుగుతున్న ఈ సమావేశానికి కోల్ఇండియా చైర్మన ప్రమోద్ఆగర్వాల్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో కోల్ఇండియా అనుబంద బొగ్గు ఉత్పాదక సంస్థలు, సింగరేణి కాలరీస్ యజమాన్యాల ఉన్నతాధికారులతో పాటు జేబీసీసీఐ సభ్య సంఘాలైన బీఎంఎస్, ఏఐటీయుసీ, సీఐటీయు, హెచఎంఎస్ కార్మికసంఘాల నాయకులు పాల్గొననున్నారు. కాగా కోల్ఇండియా ఫెన్షనర్స్ సంక్షేమసంఘం వేజ్‌బోర్డు సమావేశంలో బొగ్గుగనుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల ఫెన్షనలపై సమీక్ష జరపాలని డిమాండ్ చేసింది. జాతీయ అధ్యక్షుడు ప్రబీర్ముఖర్జీ ఈమేరకు కోల్ఇండియా సింగరేణి కాలరీస్ చైర్మనలను కనీస ఫెన్షనను రూ.15వేలకు పెంచాలని, పది నెలల మూల వేతనం, కరువు భత్యాలు పరిగణలోకి తీసుకోని ఫెన్షనను ఖరారు చేయాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల మాదిరిగా ఫెన్షనలను పెంచాలని కోరారు. ఈ మేరకు వేజ్‌బోర్డు సమావేశంలో చర్చించాలని ఆయన విజ్ఙప్తిచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm