హైదరాబాద్: నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 34 వాహనాలను ముషీరాబాద్ పోలీసులు బుధవారం సీజ్ చేశారు. ముషీరాబాద్ సీఐ జహంగీర్యాదవ్ పర్యవేక్షణలో రాంనగర్, ముషీరాబాద్, భోలక్పూర్, గాంధీనగర్ సెక్టార్ల పరిధిలో ఇన్చార్జి ఎస్ఐలు, సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సీఐ జహంగీర్యాదవ్ మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి సీజ్ చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm