హైదరాబాద్: టీఆర్‌ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై పలు సెక్షన్ల కింద ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్లారెడ్డిగూడకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు ఫయాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవిరాజా తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm