హైదరాబాద్: నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు వ్యవహారంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ గురువారం సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మంత్రి గంగులతో పాటు టీఆర్ఎస్ తరఫున ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గాయత్రి రవి కూడా ఇదే వ్యవహారంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ విచారణ గురువారం రాత్రి దాకా కొనసాగింది. వీరిద్దరినీ సీబీఐ అధికారులు 9 గంటల పాటు విచారించారు. సీబీఐ విచారణ ముగిసిన అనంతరం అక్కడే మీడియాతో గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీబీఐ అధికారుల ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పానని ఆయన తెలిపారు. తనను, గాయత్రి రవిని అధికారులు వేర్వేరుగానే విచారించారన్నారు. విచారణకు మళ్లీ రావాలని తమకేమీ చెప్పలేదని, నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో తాము ఎలాంటి లావాదేవీలు జరపలేదని సీబీఐ అధికారుతోచెప్పాన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm