న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కోర్ట్ నెంబర్ 11లో ఉదయం పదిన్నరకు మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించడం ప్రారంభించింది. మొత్తం 32 పిటిషన్లలో పది బదిలీ పిటిషన్లు కాగా పది బెయిల్‌లకు సంబంధించినవి. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎమ్ త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నిన్ననే ఏర్పాటు చేశారు.
2013లో కూడా ఇలాగే జస్టిస్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. అయితే అది అనుకోకుండా జరిగింది. నాడు న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ ఆలం గైర్హాజరు కావడంతో మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం నాడు ఏర్పాటైంది. ఇలా మహిళా న్యాయమూర్తులతోజరగడం ఇది మూడో సారిగా తెలిస్తుంది. 2018లో జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురే మహిళా న్యాయమూర్తులున్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది, జస్టిస్ బీ వీ నాగరత్న ముగ్గురూ 2021 ఆగస్ట్ 31న ప్రమాణం చేశారు. 2021లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 4గా ఉండేది. 2021లో జస్టిస్ ఇందిరా బెనర్జీ కూడా ఉన్నారు. ఇందిరా బెనర్జీ ఈ ఏడాది అక్టోబర్‌లో రిటైరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Dec,2022 09:47PM