మహారాష్ట్ర: ముంబయి నగరంలోని పాఠశాల తరగతి గదిలో దారుణం జరిగింది. సెంట్రల్ ముంబయిలోని హార్బర్ లైన్‌లోని మరాఠీ మీడియం సివిక్ స్కూల్ క్లాస్‌రూమ్‌లో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె సహవిద్యార్థులు ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. తరగతిలోని ఇతర విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. బాలిక బంధువు ఫిర్యాదు మేర ముంబయి పోలీసులు ఇద్దరు మైనర్ బాలురపై కేసు నమోదు చేశారు. నిందితులు, బాధితురాలు ఒకే తరగతిలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. క్లాసులో ఎవరూ లేని సమయంలో ఇద్దరు మైనర్ బాలురు తరగతి గదిలో తమ క్లాస్‌మేట్‌పై లైంగికదాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన తర్వాత బాలిక భయపడిపోయి.. కాస్త ఆలస్యంగా జరిగిన విషయాన్ని బంధువులకు తెలిపింది. ‘‘బాలిక బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. బాలికను వైద్య పరీక్షల కోసం పంపి, ఇద్దరు మైనర్ బాలురను జువైనల్ జస్టిస్ బోర్డ్ ముందు హాజరుపర్చగా, వారిని డోంగ్రీలోని చిల్డ్రన్స్ హోమ్‌కు పంపింది’’ అని ముంబయి పోలీసులు చెప్పారు.ఈ సంఘటన స్కూల్లో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm