అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో అడ్వకేట్ జేఏసీ శుక్రవారం ఉదయం భేటీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదులు నిరసనలు చేస్తున్నారు. ఈక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర గవర్నర్‌ను ఏపీ అడ్వకేట్ జేఏసీ నాయకులు జడ శ్రవణ్ కుమార్, వై కే, సుంకర రాజేంద్ర ప్రసాద్ తదితరులు కలిశారు.
Mon Jan 19, 2015 06:51 pm